Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు : టీటీడీ ఛైర్మన్
posted on: Jan 30, 2026 3:10PM
.webp)
గత వైసీపీ ప్రభుత్వంలో కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి మహా పాపం చేశారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా హిందూవుల మనోభావాలను దెబ్బతీశారని టీటీడీ ఛైర్మన్ మండిపడ్డారు. కాసుల కక్కుర్తి కోసం భోలే బాబా డెయిరీని ఎంచుకున్నారు. గత తిరుమల ఛైర్మన్, ముఠా మేస్త్రి సహకారం లేకుండా ఇవన్నీ చేయగలరా? అని ప్రశ్నించారు. నెయ్యిలో నూటికి నూరు శాతం కల్తీ జరిగిందన్నారు.
నివేదికలో జంతువుల కొవ్వులు లేవని ఎక్కడా నిర్ధరణ కాలేదని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్ప ఖాతాలోకి రూ.కోట్లు వచ్చాయి... ఆ బ్యాంకు ఖాతా నుంచి ఎక్కడికి వెళ్లాయో సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమాల వెనుక ఉన్నవారి పేర్లు బయటపెట్టాలని సీబీఐని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం రాకుంటే ఆ కల్తీ నెయ్యి ఇంకా కొనసాగేది. దుర్మార్గుల నుంచి టీటీడీనీ మనమంతా కాపాడుకోవాలి’’అని బీఆర్ నాయుడు అన్నారు. గతంలో ఎన్నో ఆరాచకాలు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారు. సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని తిరుమల ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.






