Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైసీపీది ధన బలం.. తెలుగుదేశంది జన బలం.. ఏడీఆర్ నివేదిక వెల్లడి.!
posted on: Aug 7, 2026 11:37AM

ప్రజా బలం ముందు ధన బలం తలవంచక తప్పదని మరోసారి రుజువైంది. 2024 ఎన్నికలలో వైసీపీ ధన బలంతో గెలిచేందుకు ప్రయత్నించి ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా, ప్రజాబలంతో బరిలో నిలిచిన తెలుగుదేశం ఘన విజయం సాధించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు, గణాంకాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఇటీవల విడుదల చేసిన ఆర్థిక విశ్లేషణ నివేదిక ప్రస్ఫుటంగా తేల్చింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వివరాలను ఏడీఆర్ నివేదిక బయటపెట్టింది.
ఏడీఆర్ నివేదిక మేరకు దేశంలోని ప్రాంతీయ పార్టీల ఆదాయంలో తెలుగుదేశం పార్టీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరానికి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఆదాయం 228.31 కోట్ల రూపాయలు. ఇది దేశవ్యాప్తంగా 36 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో దాదాపు 19 శాతం. తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఆదాయంలో సభ్యత్వ రుసుములు, పార్టీ చందాలు, బ్యాంక్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ ప్రధాన వనరులుగా నిలిచాయి.
అయితే.. ఎన్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది. ఈ మొత్తం వ్యయంలో ఆ పార్టీ 300 కోట్ల రూపాయలకు పైగా కేవలం ఎన్నికల ప్రచారానికే కేటాయించింది.
దీనికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో వ్యయం చేసింది. పార్టీకి వచ్చిన 228.31 కోట్లరూపాయల ఆదాయంలో తెలుగుదేశం 61.33 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇందులో ఎన్నికల వ్యయం 31.73 కోట్ల రూపాయలు. ఆదాయంలో ఏకంగా 73 శాతానికి పైగా.. అంటే 167 కోట్ల రూపాయలను మిగులు నిధిగా భద్రపరుచుకుంది. ఇదే సమయంలో పొత్తులో ఉన్న జనసేన పార్టీ రూ.64.1 కోట్ల ఆదాయాన్ని, రూ.56.9 కోట్ల వ్యయాన్ని చూపించింది.
ఏడీఆర్ నివేదికను ఉటంకిస్తూ.. కేవలం ప్రకటనలు, ప్రచార ఆర్భాటాలకు వందల కోట్లు గుమ్మరించినంత మాత్రాన ఓటర్లను ఆకట్టుకోవడం సాధ్యం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ 340 కోట్లకు పైగా వెచ్చించి భారీగా ఎన్నికలలో విజయం కోసం ఖర్చు చేసినప్పటికీ, ఆ పార్టీ 2024 ఎన్నికలలో గెలిచినది కేవలం 11 స్థానాలలో మాత్రమే. అదే సమయంలో పరిమిత వ్యయంతోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన తెలుగుదేశం కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలలో 135 స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ధనబలం కంటే ప్రజాబలమే పార్టీల విజయానికి కీలకమని అని ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఏడీఆర్ నివేదిక కూడా ప్రస్ఫుటంగా తేల్చిచెప్పాయి.
ADR Report Andhra Pradesh, TDP Election Funds, YSRCP Campaign Expenditure, AP Assembly Elections 2024, Political Party Income, TeluguOne


.webp)



