Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నిలువెల్లా శ్రీరామనామాలే.. నీతూ అంబానీ ధరించిన చీర ప్రత్యేకత
posted on: Mar 28, 2026 12:39PM
.webp)
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ నీతా అంబానీ రామనామాలతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన చీర ధరించి తన రామభక్తిని చాటుకున్నారు. తద్వారా భారత సంస్కృతి, సంప్రదాయాల ఉన్న మక్కువను మరో సారి చాటారు.
నీతా అంబానీ ధరించిన ఈ చీర ఓ అద్భుత కళాఖండంగా ఉందని పలువురు ప్రస్తుతిస్తున్నారు. సిద్ధమైన రంగులను ఉపయోగించి బంధ అనే సాంప్రదాయ పద్ధతిలో నేసిన ఈ చీర మధ్య భాగంలో రామ శిలల స్ఫూర్తితో మొజాయిక్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తికి భాషా భేదం లేదని చాటుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ భాషలలో రామ్ అనే పదాన్ని ఈ చీరపై నేయడం విశేషం. అలాగే ఈ చీర కొంగు భాగంలో ఒడియా లిపిలో పవిత్రమైన మంత్రాలను నేయడం ద్వారా ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఈ చీర ఉంది. సాంప్రదాయ ఇక్కత్ నమూనాలు, ఆధ్యాత్మిక అక్షరాలు కలగలిసిన ఈ చీర భారతీయ వస్త్రకళా నైపుణ్యానికి అద్దం పట్టేదిలా ఉందని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నితా అంబానీ ధరించిన ఈ చీర భారత సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టడమే కాకుండా భారత నేత కళాకారుల అద్భుత ప్రతిభ, నైపుణ్యాలను కూడా ప్రపంచానికి చాటింది.
చేనేత కళాకారులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే నీతా అంబానీ గతంలో కూడా పలు అంతర్జాతీయ వేదికలపై స్వదేశీ వస్త్రాలను ధరించిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీరామ నవమి వేళ ధరించిన ఈ రామ నామాల చీర కూడా దేశీయ కళలను, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా రూపొందించి ధరించినట్లు నీతా అంబానీ తెలిపారు. నీతా అంబానీ వస్త్రధారణకు సంబంధించిన ఫోటోలు ప్రస్తతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నీతా అంబానీ రామభక్తిని, భారత సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆమెకు ఉన్న గౌరవాన్ని ప్రశంసిస్తున్నారు.



.webp)


