Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ..."పతంజలి"కి అంత సీన్ లేదంట...!
posted on: Jun 1, 2016 4:24PM
.jpg)
ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ సారథ్యంలో నడుస్తున్న పతంజలి సంస్థపైనా, బాబా రాందేవ్ పైనా ప్రముఖ పారిశ్రామికవేత్త, గోద్రేజ్ గ్రూప్ ఛైర్మన్ ఆది గోద్రేజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ లాబీ ఐఎంసీ ముంబైలో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్‌లో ఆది గోద్రేజ్ మాట్టాడారు. రాందేవ్ బాబా ఇమేజ్, పరపతి వల్లే పతంజలి నడుస్తోందని, అందులోనూ యోగా, ఆయుర్వేద ఉత్పత్తులు బాగున్నాయి కాని మిగిలిన వాటిని అంతగా చెప్పుకోనవసరం లేదన్నారు. నెయ్యి, తేనె వంటి సాధారణ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది తప్ప మిగిలిన ఉత్పత్తులకు అంత సీన్ లేదన్నారు. వ్యాట్ సెగ్మెంట్‌లోనూ ఆ సంస్థ వాటా చాలా తక్కువ అని ఆయన అన్నారు. అలాగే కేవలం టాయిలెట్ సబ్బుల విభాగంలోనే కన్జూమర్ ప్రోడక్ట్స్‌తో పోటీ పడుతోందన్నారు. ఈ విభాగంలో పతంజలి ప్రాతినిధ్యం చాలా తక్కువ అన్నారు.
తొలుత ఆయుర్వేద ఫార్మసీగా ప్రారంభమైన పతంజలి..ఆ తర్వాత కన్జ్యూమర్ ఉత్పత్తుల సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. మొత్తం 30 రకాల ఉత్పత్తులతో దేశంలోనే అతిపెద్ద ఎఫ్ఎంసీజీ రంగ సంస్థగా అవతరించడానికి రెఢీ అవుతోంది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.450 కోట్లుగా నమోదైన కంపెనీ ఆదాయం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి రూ.5000 కోట్లకు పైగా చేరుకుని నెస్లే, యూనిలివర్ వంటి అంతర్జాతీయ సంస్థలకు గట్టీ పోటీనిస్తోంది. అంతేకాదు పతంజలి ప్రస్తుత ఆదాయం డాబర్, ఇమామీ, మారికో, గోద్రేజ్ వంటి అనేక బడా సంస్థల ఆదాయంతో సమానమని హెచ్ఎస్‌బీసీ సర్వేలో తేల్చింది. తన ఉత్పత్తులకు పోటీగా వస్తున్న పతంజలి పట్ల ఆది గోద్రేజ్ ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్నారు. బహుశా ఆ ఆక్రోశాన్నంతా వెళ్లగక్కడానికి ఈ సమావేశాన్ని వేదికగా మార్చుకున్నట్లున్నారు.





