Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పవన్ కళ్యాణ్ పక్కనే ఆ పుస్తకమేమిటి?
posted on: Jun 19, 2024 11:32AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో ఆయన టేబుల్ మీద కనిపించిన ఒక పుస్తకం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అది మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ‘ఆధునిక మహాభారతం’ అనే పుస్తకం. పవన్ కళ్యాణ్ మొదటి నుంచీ గుంటూరు శేషేంద్రశర్మ అభిమాని. పలు సందర్భాలలో శేషేంద్ర శర్మకు రచనలను, పంక్తులను పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరిస్తున్న సందర్భంలో కూడా తన పక్కన ఆ పుస్తకాన్ని ఉంచుకోవడం అనేది, శేషేంద్ర శర్మ మీద పవన్ కళ్యాణ్‌కి వున్న అభిమానాన్ని మరోసారి తేటతెల్లం చేసింది. పవన్ పక్కన ఆ పుస్తకాన్ని చూసిన పవన్ అభిమానులు ‘ఆధునిక మహాభారతం’ పుస్తకాన్ని చదవాలన్న ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.






