Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చిన్ననాటి స్నేహితుడితో బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవి ఏడడుగులు.. వైరల్ అవుతున్న పిక్స్!
posted on: Mar 21, 2026 5:16PM
నటి, బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం ఓ ఇంటికి కోడలైంది. గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటూ విదేశాల్లో ఉన్నత చదువుల్లో బిజీగా ఉన్న ఈ భామ, తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకలో తన చిరకాల మిత్రుడు హేమంత్‌వర్మతో కలిసి ఏడడుగులు వేసింది.
చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, తమ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లారు. వరుడు హేమంత్‌వర్మ సినీ పరిశ్రమలో ప్రముఖ ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. వీరిద్దరూ చిన్ననాటి నుంచే స్నేహితులు కావడం విశేషం. గతేడాది డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జోడీ, తాజాగా మార్చి 20న వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆర్భాటాలకు పోకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక సింపుల్‌గా జరిగింది.
పునర్నవి భూపాలం అనగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ‘ఉయ్యాల జంపాల’ సినిమా. ఆ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన సునీత పాత్రలో ఆమె పండించిన అమాయకత్వం, నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా, ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది మాత్రం బిగ్ బాస్ రియాలిటీ షోనే. అందులో తన ముక్కుసూటి తనంతో బోల్డ్ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది.
బిగ్ బాస్ తర్వాత వెండితెరపై బిజీ అవుతుందని అందరూ భావించినప్పటికీ, పునర్నవి మాత్రం తన కెరీర్ విషయంలో భిన్నమైన నిర్ణయం తీసుకుంది. గ్లామర్ ఫీల్డ్‌కు విరామం ప్రకటించి, లండన్‌కు వెళ్లి సైకాలజీలో ఉన్నత విద్యను అభ్యసిస్తోంది. అక్కడి నుంచే సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ఇప్పుడు నేరుగా పెళ్లి వార్తతో అందరికీ స్వీట్ షాక్ ఇచ్చింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో పునర్నవి వెడ్డింగ్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ లుక్‌లో పునర్నవి ఎంతో కళగా కనిపిస్తుండగా, వరుడు హేమంత్ కూడా క్లాసీగా ఉన్నాడు. ఈ జంటను చూసిన నెటిజన్లు “మేడ్ ఫర్ ఈచ్ అదర” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం ఈ కొత్త దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.





