Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కుష్బూను టార్గెట్ చేసిన హిజ్రాలు..
posted on: Apr 5, 2016 10:43AM
సినీనటి, కాంగ్రెస్ నేత కుష్బూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తన ప్రవర్తనతో కోరి చిక్కుల్లో చిక్కుకోవడం ఆమెకు అలవాటే. ఈ సారి హిజ్రాలను టార్గెట్ చేస్తూ మాటల తుటాలు పేల్చారు. కాంగ్రెస్ జాతీయ మీడియా ప్రతినిధి అయిన కుష్బూ ఒక ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో హిజ్రాలు పోటీ చేయాలని ఆశపడటం సమంజసం కాదని, తమకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా? లేదా? అన్న విషయంపై వారు పునరాలోచించుకోవాలని సూచించారు.
దీనిపై హిజ్రాలు మండిపడ్డారు. చెన్నైలోని కాంగ్రెస్ కార్యాలయాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు. ఉత్తర భారతదేశానికి చెందిన కుష్బూ తమిళ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారని, ఇప్పుడు మరోసారి తమ విషయంలోనూ అలాగే నోటీ దురుసును చూపారన్నారు. కుష్బూ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు తమకు ఉందని హిజ్రాలు స్పష్టం చేశారు.




