నటి అంజలి పై అరెస్టు వారెంటు

posted on: Sep 12, 2013 7:26PM

 

 

 

ప్రముఖ సినీ నటి అంజలి పై చెన్నైలోని సైదాపేట కోర్టు ఆమెపై అరెస్టు వారెంటు జారీచేసింది. తమిళ సినీ దర్శకుడు కళంజియం దాఖలుచేసిన పరువు నష్టం కేసు విచారణకు పదే పదే హాజరు కాకపోవడంతో ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీచేసిన కోర్టు, ఈసారి ఏకంగా అరెస్టు వారెంటే ఇచ్చేసింది. అంజలి తెలుగులో వెంకటేష్-రామ మల్టీ స్టారర్ ‘మసాలా' చిత్రంలో వెంకటేష్ సరసన నటిస్తోంది. దీంతో పాటు ఆమె నటించిన ‘మద గజ రాజా' చిత్రం కూడా విడుదలకు సిద్ధం అవుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...