Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రైతు రుణం తీర్చిన విశాల్- అందుకోసం పార్టీలకు దూరం!
posted on: Mar 16, 2016 1:07PM

తెలుగువాడైనప్పటికీ తమిళనాట తనకంటూ ఓ స్థానం ఏర్పరుచుకున్న విశాల్, అక్కడి నడిగర్ సంఘంలోనూ తన సత్తాను చాటుకున్నాడు. కానీ సినిమాల్లోనూ, రాజకీయాల్లోనే కాదు... నిజజీవితంలోనూ విశాల్ హీరోనే అంటున్నారు ఆయన అభిమానులు. ఆమధ్య చెన్నైని ముంచెత్తిన వరదల్లో తానున్నానంటూ సాయానికి సిద్ధపడినా, ఈమధ్యనే ఓ గ్రామంలో షూటింగ్ జరుగుతుండగా అక్కడి ఇబ్బందిని గమనించి మరుగుదొడ్లను నిర్మించినా... విశాల్ తన పెద్ద మనసుని చాటుకుంటూనే ఉన్నాడు. తాజాగా తంజావూర్ జిల్లాలోని ఓ పేద రైతుని ఆదుకుని మరోసారి వార్తల్లోకెక్కాడు. తంజావూరికి చెందిన బాలన్ అనే సందరు రైతు బ్యాంకులకు 1.35 లక్షల రూపాయలు బాకీపడ్డాడు. సమయానికి వాయిదాలను చెల్లించకపోవడంతో, బ్యాంకు తరఫున రికవరీ ఏజెంట్లు, పోలీసులు కలిసి బాలన్ మీద చేయి చేసుకోవడమే కాకుండా, అతని ఏకైక ఆధారమైన ట్రాక్టర్‌ను కూడా లాక్కుపోయేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో చూసిన విశాల్ చలించిపోయాడు. ‘నాకు అతను ఎవరో తెలియదు. కానీ బాకీలు చెల్లించలేని రైతు మనసు ఎంత విలవిల్లాడుతుందో నేను ఊహించగలను. అతని రుణాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాను’ అంటూ పేర్కొన్నాడు. అంతేకాదు, సదరు రుణం తీర్చేందుకు తాను నాలుగువారాల పాటు పార్టీలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చాడు. విశాల్ సాయం ఇక్కడితో ఆగేట్లు కనిపించడం లేదు! ఇలా ఇబ్బందుల్లో ఉన్న రైతులకి సంబంధించిన సమాచారాన్ని ఒక చోటకి చేరుస్తాననీ, ఇలాంటి వారి కోసం నిధులను సేకరించేందుకు తన అభిమానులు ఓ ప్రత్యేకమైన బ్యాంకు ఖాతాను తెరవబోతున్నారనీ చెప్పుకొచ్చాడు విశాల్! మన తెలుగు హీరోలూ ఉన్నారే!


.jpg)



