ధర్మేంద్రకు తీవ్ర అస్వస్థత
posted on: Nov 1, 2025 4:27PM
.webp)
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. శుక్రవారం (అక్టోబర్ 31) రాత్రి ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన ముంబై లోని బ్రీచ్ కాండి ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయన ఆ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ధర్మేంద్ర ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అయితే ధర్మేంద్ర అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం తెలిసి పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ధర్మేంద్ర ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదనీ, ఆయనను ఆదివారం లేదా సోమవారం డిశ్చార్జ్ చేస్తామనీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.






