Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏసీపీ జె. నర్సయ్యకు రాష్ట్రపతి పోలీసు పతకం
posted on: Aug 14, 2026 2:51PM

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సికింద్రాబాద్ జోన్ అద నపు డీసీపీగా పనిచేస్తున్న జె. నర్సయ్యకు 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు పతకం అందుకోనున్నారు...
1991 జూలై 16న సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరిన జె. నర్సయ్యకు 2026 ఆగస్టు 15 నాటికి 35 సంవత్సరాల ఒక నెల పోలీసు సేవ పూర్తవు తుంది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ జోన్ అద నపు డీసీపీగా 2024 ఆగస్టు 8 నుంచి బాధ్య తలు నిర్వహిస్తున్నారు.
తన సుదీర్ఘ పోలీసు ప్రస్థానంలో నర్సయ్య పలు కీలక కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరిచారు. యాంటీ నక్సల్ ఆపరేష న్లలో కీలకంగా వ్యవహ రించి మిలిటెంట్లు, నక్సల్ సానుభూతిపరుల అరెస్టు లో ముఖ్యపాత్ర పోషిం చారు. 2010లో హైదరా బాద్ పాతబస్తీలో జరిగిన మతపరమైన ఉద్రిక్తతలను సమర్థవంతంగా ఎదు ర్కొని, పలు హత్య కేసు లను ఛేదించి శాంతిభద్రత లను పునరుద్ధరించడంలో కీలకంగా వ్యవహరించారు
2012లో డీఆర్‌డీఎల్ శాస్త్రవేత్త కుమారుడు 10 ఏళ్ల ప్రణవ్ హత్య కేసును ఛేదించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్‌లో పనిచే స్తున్న సమయంలో పాకిస్థాన్‌లో ముద్రించిన రూ.6.50 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసు కున్న కేసులో కూడా కీలకంగా వ్యవహరించారు కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందంతో కలిసి పని చేస్తూ ఒడియన్ థియేటర్ బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడు జియావుల్ హక్‌ను పట్టుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు అలాగే సంచలనం సృష్టిం చిన మద్దెల చెరువు సూరి హత్య కేసు దర్యాప్తు లోనూ ముఖ్యపాత్ర పోషించి భాను కిరణ్ గన్‌మ్యాన్‌ను అరెస్ట్ చేయ డంతో పాటు ఆయుధా లను స్వాధీనం చేసుకోవ డంలో సహకరించారు.
నర్సయ్య దర్యాప్తు నైపుణ్యాలతో అనేక కీలక కేసులను ఛేదించడంతో పాటు పలు కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్షలు పడేలా దర్యాప్తు సాగించినట్లు పతకానికి సంబంధించిన సిటేషన్‌లో పేర్కొన్నారు. నర్సయ్యకు గతంలో కూడా పలు పోలీసు సేవా పురస్కా రాలు లభించాయి. 2010లో ఏపీ పోలీస్ సేవా పతకం, 2015లో తెలంగాణ రాష్ట్ర ఉత్తమ పోలీసు సేవా పతకం, 2017లో ఇండియన్ పోలీస్ మెడల్, 2019లో అతిఉత్కృష్ట మెడల్, 2021లో తెలంగాణ రాష్ట్ర మహోన్నత సేవా పతకం అందుకున్నారు.అదేవిధంగా ఆయనకు 16 నగదు రివార్డులు, 261 GSEలు, 32 MSEలు, 20 కమెండే షన్లు, 18 ప్రశంసలు లభించినట్లు అధికారిక రికార్డుల్లో
పేర్కొన్నారు.
రాష్ట్రపతి పోలీసు పతకా నికి సంబంధించిన సమ గ్రత ధ్రువీకరణ పత్రంలో నర్సయ్యపై ఎలాంటి న్యాయ, శాఖాపరమైన లేదా విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో లేవని, ఎలాంటి విచారణలు ప్రతిపాదించబడలేదని పేర్కొన్నారు. 2015-16 నుంచి 2024-25 వరకు సమీక్షా కాలంలో ఆయన కు ఎలాంటి ప్రధాన శిక్ష విధించలేదని కూడా ధ్రువీ కరించారు.అసాధారణమైన సేవ, కర్తవ్యనిబద్ధత, దర్యాప్తు ప్రతిభను గుర్తిస్తూ 2026స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జె. నర్సయ్యకు రాష్ట్రపతి పోలీసు పతకం అందించాలని సిఫార్సు చేశారు.
ACP J. Narsaiah awarded Presidents Police Medal, CM Revanth reddy, Telangana police, Hyderabad police



.webp)


