కోఠి కాల్పుల కేసులో... పోలీసులను తప్పుదోవపట్టించిన నిందితులు!

posted on: Feb 2, 2026 12:34PM

హైదరాబాద్‌ కోఠిలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద జరిగిన సంచలన కాల్పుల కేసులో నిందితుల జాడ ఇంకా లభించలేదు. కాల్పులకు తెగబడ్డ ఇద్దరు నిందితులు   పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు దర్యాప్తులో  వెల్లడైంది.  ఘటన జరిగిన వెంటనే నగరం విడిచి వెళ్లినట్లు బిల్డప్ ఇచ్చి.. ప్రణాళిక ప్రకారం  హైదరాబా దులోనే తిరుగుతున్నట్లు  పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిపి నగదు దోచుకున్న తరువాత నిందితులు తుపాకితోనే సిటీలో తిరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

వారు  తొలుత కాచిగూడ రైల్వే స్టేషన్‌కు వెళ్లి, అక్కడి నుంచి మళ్లీ వెనక్కు తిరిగి రావడం ద్వారా పోలీసులను తప్పుదోవపట్టించారని భావిస్తున్నారు. నిందితులు నగరం విడిచి వెళ్లినట్లు పోలీసులు భావించేలా చేసి కాచిగూడ నుంచి మళ్లీ ఆటో మాట్లాడుకుని చంద్రాయణగుట్ట వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు గుర్తించారు. శనివారం( జనవరి 31) న  నిందితులు నగరంలోనే పలు ఆటోలు మారుస్తూ తిరిగినట్లు గా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.  ఒకే ఆటోలో ఎక్కువసేపు ప్రయాణించ కుండా, తరచూ ఆటోలను మారుస్తూ,  పోలీసులను ఏమార్చారని తెలుస్తోంది. ఘటన జరిగిన రోజే నిందితులు ట్రైన్‌లో ప్రయాణిస్తే పట్టుబడతామని అంచనా వేసి తమ ప్లాన్‌ను మార్చుకుని సిటీలోనే తిరుగుతున్నట్లుగా పోలీసులు అనుమా నిస్తున్నారు.

పాతబస్తీ చంద్రాయణ గుట్ట పరిసరాల్లో నిందితులు కనిపించినట్లు సమాచారం రావడంతో ఆ ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ, ఆటో డ్రైవర్లను విచారిస్తూ నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. అంతేకాకుండా పాతబస్తీలో అదనపు బలగాలను మోహరించారు.ఇలా ఉండగా నిందితులు ఇప్పటికే నగరం దాటేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఉత్తరాది రాష్ట్రాల వైపు వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ఆ కోణంలో కూడా  దాటి వెళ్లిన నిందితులు నార్త్ స్టేట్స్ వైపు వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తు న్నారు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నిందితులు ఆయుధాలతో  సంచరిస్తుండవచ్చనీ,    అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించిన పోలీసులు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...