Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు
posted on: Feb 9, 2026 8:42PM

కృష్ణా జిల్లాలో జరిగిన ఒక హృదయ విదారక కేసులో న్యాయం చివరికి బాధిత బాలికకు దక్కింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి విజయవాడ పోక్సో కోర్టు జీవితకాలపు జైలు శిక్ష విధించింది. నేరం జరిగి కేవలం 11 నెలల్లోనే శిక్ష పడేలా చేసిన కృష్ణా జిల్లా పోలీసుల వేగవంతమైన దర్యాప్తు, కోర్టు విచారణ సమాజానికి ఒక బలమైన సందేశం ఇచ్చింది. ఈ కేసు కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ, మంటాడ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికకు సంబంధించినది. తల్లి–తండ్రుల మధ్య మనస్పర్థల కారణంగా బాలిక తన తల్లి, చెల్లితో కలిసి మంటాడలో నివసిస్తోంది.
ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న ఆమె అన్న కొమ్ము సౌల్, బాలికను బెదిరిస్తూ, భావోద్వేగంగా మోసం చేసి, పలుమార్లు శారీరకంగా వేధించాడు. ఆమెకు తాను ముద్దుపెట్టుకున్న ఫోటోలు ఉన్నాయని భయపెట్టి నోరు మూయించాడు. క్రిస్మస్ పండుగ నాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి విజయవాడకు తీసుకెళ్లి, అక్కడ కూడా లాడ్జిలో అత్యాచారం చేశాడు. తర్వాత హైదరాబాద్‌లో కూడా అదే రీతిలో వేధింపులు కొనసాగించాడు. కొంతకాలం తరువాత బాలికకు ఆరోగ్య సమస్యలు రావడంతో తల్లికి అనుమానం వచ్చింది. పరీక్షల్లో ఆమె గర్భవతిగా ఉన్నట్టు తెలిసింది.
నిజం వెలుగులోకి రాగానే తల్లి ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు పమిడిముక్కల పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యి, క్రైమ్ నంబర్ నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. గుడివాడ సబ్ డివిజన్ డీఎస్పీ పర్యవేక్షణలో ఎస్సై బి.శ్రీను కేసును బలంగా సిద్ధం చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేవలం 60 రోజుల్లోనే చార్జ్ షీట్ దాఖలు చేశారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఈ కేసును “కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ మానిటరింగ్” విధానంలో వేగంగా విచారించారు. 24 మంది సాక్షులను విచారించి, పది నెలల్లోనే ట్రయల్ పూర్తి చేశారు.
చివరకు 09.02.2026న విజయవాడ పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి వేల్పుల భవానీ గారు నిందితుడికి మరణించెంత వరకు జైలు శిక్షతో పాటు రూ.6,000 జరిమానా విధించారు. బాధిత బాలికకు జరిమానా నుంచే రూ.30,000 ఇవ్వాలని, అదనంగా రూ.5 లక్షల నష్టపరిహారం వచ్చేలా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పుతో కృష్ణా జిల్లా పోలీసులు మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తారో మరోసారి నిరూపించారు. ఎవరైనా బాధితులు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే చట్టం తప్పకుండా రక్షణ కల్పిస్తుందనే విశ్వాసాన్ని ఈ కేసు సమాజానికి ఇచ్చింది. న్యాయం ఆలస్యం కాకుండా బాధితులకు దక్కాలంటే ధైర్యం, చట్టంపై నమ్మకం అవసరమని ఈ ఘటన మనకు గుర్తుచేస్తోంది.



.webp)


