పుణె నేషనల్ హైవైపై ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

పూణే, బెంగళూరు జాతీయ రహదారిపై   గురువారం (నవంబర్ 13) జరిగిన   ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.  అతివేగంగా వెడుతున్న కంటైనర్ అదుపు తప్పి ఆరు వాహనాలను, మరో  కంటైనర్ ను ఢీ కొంది.  

ఈ ఘటనతో   ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసింది.  సతారా నుండి ముంబై వైపు వెళుతున్న   కంటైనర్ బ్రేక్ ఫెయిలవ్వడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu