Latest News

లోయలో పడిన ఆర్మీ వెహికిల్.. పది మంది జవాన్లు దుర్మరణం

posted on: Jan 22, 2026 5:03PM

ఆర్మీ వాహనం లోయలో పడి పది మంది జవాన్లు దుర్మరణం పాలైన ఘటన జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు జరిగింది.  జమ్మూకశ్మీర్‌లోని దోడా సెక్టార్‌లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జవాన్లతో వెళ్తున్న ఓ ఆర్మీ వాహనం అదుపుతప్పి 200 అడుగుల లోయలో పడింది.  ఈ దుర్ఘటనలో 10 మంది జవాన్లు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, సైన్యం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  

క్షతగాత్రులను హుటాహుటిన ఉధంపూర్ మిలటరీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 17 మంది సైనికులు ఉన్నారు.  భదేర్వా-చంబా అంతర్రాష్ట్ర రహదారి వెంబడి ఖన్నీ టాప్ దగ్గర డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం 200 అడుగల లోయలో పడినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...