ఒకదానికొకటి గుద్దుకున్న జగన్ కాన్వాయ్ కారులు.. పలువురికి గాయాలు

వైసీసీ అధినేత, మాజీ  ముఖ్యమంత్రి జగన్  కృష్ణ జిల్లా పర్యటనలో  అపశ్రుతి చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్ వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొని పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన కారణంగా ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ప్రమాదంలో జగన్ ప్రయాణిస్తున్న వాహనానికి ఎటువంవటి ప్రమాదం జరగలేదు.  

 జగన్  మొంథా తుపాను ప్రభావంతో  సంభవించిన పంట నష్టాన్నిపరిశీలించేందుకు మంగళవారం (నవంబర్ 4) తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు. ఆయన పర్యటన పెనమలూరు, పామర్రు, పెడన నియోజకవర్గాలలో సాగాల్సి ఉంది. అయితే ఉయ్యారు మండలం,  గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 

కాగా జగన్ కృష్ణా జిల్లా పర్యటనకు పోలీసులు పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. జగన్ పర్యటనకు కేవలం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సమయం కేటాయించారు.   ఈ పర్యటనలో జగన్ కాన్వాయ్‌లో 10 వాహనాలకు మించి ఉండరాదని, మొత్తం 500 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు కండీషన్ పెట్టారు. నిబంధనలను అతిక్రమించి, పరిమితికి మించి జనాన్ని లేదా వాహనాలను సమీకరించినా, అనుమతిని దుర్వినియోగం చేసినా పర్యటనను తక్షణమే రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu