Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు
posted on: Jun 3, 2026 10:49AM

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరి ణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగ రావు నివాసంలో ఎసీబీ అధికారులు బుధవారం (జూన్ 3) సోదాలు నిర్వహించారు. ఆయన నివాసం
తో పాటు పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు బుధవారం (జూన్ 3)ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. భుజంగరావు నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నహితు లకు చెందిన ఇళ్ళు ల్లో ఏసీబీ బృందాలు ఏకకా లంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భూములు, భవనాలు, బ్యాంకు ఖాతాలు, పెట్టుబ డులు, వ్యాపార లావాదేవీ లకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తు న్నట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు మాజీ పోలీసు అధికారులు విచారణను ఎదుర్కొంటుండగా, భుజంగ రావు పాత్రపై కూడా దర్యాప్తు సంస్థలు ప్రత్యేకం గా దృష్టి సారించాయి. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల అంశంపై ఏసీబీ రంగంలోకి దిగడంతో కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సోదాల అనంతరం స్వాధీనం చేసు కున్న పత్రాలు, డిజిటల్ ఆధారాల పరిశీలన తర్వాత భుజంగరావుపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకా శాలు ఉన్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.






