Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జలమండలి జీఎం నివాసంలో ఏసీబీ సోదాలు
posted on: May 19, 2026 8:46AM
.webp)
తెలంగాణలో అవినీతి తిమింగలాల వేటలో యాంటీ కరప్షన్ బ్యూరో తాజాగా హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో విస్తృత సోదాలు చేపట్టారు. మంగళవారం (మే 19) తెల్లవారుజాము నుంచే ఈ సోదాలు మొదలయ్యాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి.
మల్లాపూర్ పరిధిలో ఉన్న జలమండలి జీఎం కుమార్ నివాసంలో తెల్లవారుజామున 6 గంటలకే నుంచే ఏసీబీ ప్రత్యేక బృందాలు సోదాలు ప్రారంభించారు. ఇంట్లోంచి ఎవరూ బయటకు వెళ్లకుండా, అలాగే బయట నుంచి ఎవరూ లోపలికి రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం జీఎం కుమార్ నివాసంలోనే కాకుండా, ఆయనకు సంబంధించిన కీలకమైన నెట్‌వర్క్‌పై కూడా దృష్టి పెట్టిన అధికారులు ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.






