దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి నివాసాలలో ఏసీబీ సోదాలు

posted on: Apr 7, 2026 4:55PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కాళింగిరి శాంతి నివాసాలపై అవినీతి నిరోధక శాఖ  అధికారులు సోమవారం (ఏప్రిల్ 6)  మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఈ సోదాలు జరిగాయి. ఒక్క ఆమె నివాసాలపైనే కాకుండా ఆమెకు సన్నిహితుల నివాసాలలో కూడా ఈ సోదాలు జరిగాయి.

తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె పేరిట ఉన్న స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను  అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. తాడేపల్లి, విజయవాడ ప్రాంతాల్లో ఆమెకు  మూడు ఇళ్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. 

గత ప్రభుత్వ హయాంలో   రాజకీయ  అండదండలతోనే ఆమె ఈ స్థాయిలో పదోన్నతులు పొందారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్జనకు పాల్పడ్డారని చాలా కాలంగా శాంతిపై అభియోగాలు ఉన్న సంగతి తెలిసిందే.  ఈ సోదాలలో స్వాధీనం చేసుకున్న  కీలక పత్రాలు, ఆధారాలను విశ్లేషించిన అనం తరం ఏసీబీ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...