ఆస్పత్రిలో అభిషేక్ శర్మ.. నమీబియాతో మ్యాచ్ కు ముందు టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ
posted on: Feb 11, 2026 9:50AM

టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. టి20 వరల్డ్ కప్ లో భాగంగా గురువారం (ఫిబ్రవరి 12) నమీబియాతో జరగనున్న మ్యాచ్ కు ముందు అభిషేక్ శర్మ అస్వస్థతతో ఆస్పత్రి పాలు కావడం భారత శిబిరంలో ఆందోళన రేకెత్తిస్తున్నది. అభిషేక్ శర్మ ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరడంతో నమీబియాతో మ్యాచ్ ఆడే అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి.
తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న అభిషేక్ శర్మను సోమవారం(ఫిబ్రవరి 8) ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో మంగళవారం (ఫిబ్రవరి 9) ప్రాక్టీస్ సెషన్‌కు అభిషేక్ శర్మ దూరం అయ్యాడు. వైద్య పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే నమీబియాతో మ్యాచ్ అతడు ఆడేదీ లేనిదీ తేలుతుందని టీమ్ ఇండియా మేనేజ్ మెంట్ తెలిపింది. మంగళవారం (ఫిబ్రవరి 9) ప్రాక్టీస్ సెషన్ లో ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయడం కనిపించింది. దీంతో నమీబియాతో మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆడే అవకాశాలు లేవనీ, అతడి స్థానంలో సంజు శాంసన్ బరిలోకి దిగే అవకాశం ఉందని అర్ధమౌతోంది.



.webp)


