టి20 వరల్డ్ కప్.. పాక్ తో మ్యాచ్ కు అభిషేక్ శర్మ దూరం?

posted on: Feb 13, 2026 8:16AM

టి20 వరల్డ్ కప్ లో భారత్ కు అత్యంత కీలకమైన పాకిస్థాన్ తో మ్యాచ్ కు టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. కడుపులో ఇన్ ఫెక్షన్ కారణంగా అభిషేక్ శర్మ గురువారం (ఫిబ్రవరి12) నమీబియాతో జరిగిన మ్యాచ్ కు దూరమైన సంగతి తెలిసిందే.

అయితే ఆదివారం (ఫిబ్రవరి 15) పాకిస్థాన్ తో మ్యాచ్ కు కూడా అభిషేక్ అందుబాటులో ఉండే అవకాశాలు లేవని అంటున్నారు. ఆదివారం నాటికి అభిషేక్ శర్మ ఫిట్ నెస్ సాధించే అవకాశాలు లేవని టీమ్ ఇండియా వర్గాల ద్వారా తెలుస్తోంది. అభిషేక్ శర్మ పాక్ తో మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయంలో ఇప్పటి వరకూ టీమ్ మేనేజ్ మెంట్ అధికారికంగా ప్రకటించలేదు.  

 ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా అభిషేక్ శర్మ ప్రస్తుతం   బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో  ఉన్నాడు. అభిషేక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని  టీమ్ ఇండియా స్కిప్పర్   సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఒకటి ,రెండు మ్యాచ్‌లకు  అభిషేక్ శర్మ దూరంగా ఉండే అవకాశం ఉందన్నారు.  దీంతో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లోనూ అతను ఆడే అవకాశాలు అంతంత మాత్రమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...