Latest News

బీజేపీకి ఆరూరి రమేష్ రాజీనామా...తిరిగి సొంత గూటికి

posted on: Jan 26, 2026 8:24PM

 

 

వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎల్లుండి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. తన అనుచరులతో  సమావేశమైన బీజేపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన చర్చలు ఫలించాయి.

వారి ప్రయత్నాల ఫలితంగానే అరూరి రమేష్ తిరిగి బీఆర్ఎస్‌లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలో చేరిన అరూరి రమేష్.. అనంతరం వరంగల్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి పరాజయం పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్‌లో చేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. త్వరలోనే అధికారికంగా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...