Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఐపీఎల్ లో పరుగుల సునామీ.. ఒకే రోజు 986 రన్స్!
posted on: Apr 26, 2026 7:32AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ క్రికెట్ ప్రేమికులకు అసలైన పరుగుల పండుగను తీసుకువచ్చింది. ఈ ఏడాది బ్యాటర్లు సృష్టిస్తున్న పరుగుల సునామీతో రికార్డులన్నీ బద్దలైపోతున్నాయి. శనివారం (ఏప్రిల్ 25) జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో పరుగుల సునామీ కాదు అంతకు మించి అన్నట్లుగా బ్యాటర్లు చెలరేగిపోయారు. ఇంత వరకూ ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రెండు మ్యాచ్ లలోనూ కలిపి ఏకంగా 986 పరుగులు నమోదు అయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఒకే రోజు అత్యధిక పరుగులు సాధించడం ఇదే మొదటి సారి.
శనివారం (ఏప్రిల్ 25) జరిగిన రెండు మ్యాచ్ లలోనూ కూడా బ్యాటర్లు తొలి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫోర్లు, సిక్సర్ల తో పరుగుల తుపాను సృష్టించారు. గతంలో అంటే ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒకే రోజు 800కు పైగా పరుగులు వచ్చిన రికార్డు ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది. ఒకే రోజు దాదాపు వెయ్యి పరుగులకు చేరువలో స్కోరు నమోదవ్వడం టీ20 క్రికెట్ లోనే ఒక అద్భుతం అని చెప్పవచ్చు.
ఆధునిక క్రికెట్‌లో పవర్ హిట్టింగ్ వేరే లెవెల్ కు చేరింది. ముఖ్యంగా పవర్ ప్లే ఓవర్ల లో సాధ్యమైనన్ని పరుగులు పిండుకుంటే.. డెత్ ఓవర్లలో భారీ షాట్లతో విరుచుకుపడే అవకాశం ఉండటంతో ప్రస్తుతం ఐపీఎల్ లో నిర్ణీత 20 ఓవర్లలో 200 ప్లస్ స్కోర్ అన్నది మూమూలుగా మారిపోయింది.ఇక ఇప్పుడు రెండు మ్యాచ్ లలో కలిపి 986 పరుగుల రికార్డు ఐపీఎల్ గ్లామర్ మరింత పెంచేసింది. మొత్తానికి, క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ 2026 సీజన్ పరుగుల పండుగను తీసుకు వచ్చింది. వినోదాన్ని పంచుతోంది.


.webp)



