Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నెల్లూరులో విషాదం...బాలుడి ప్రాణం తీసిన ఫోన్ గొడవ
posted on: Apr 28, 2026 9:43PM
.webp)
ఇద్దరు బాలురు ఫోన్ చూస్తూ ఆడుకుంటుండగా వారి మధ్య వివాదం జరిగింది. అది పెద్దదై చివరికి ఒకరి ప్రాణాలు తీసేదాకా వెళ్లింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలం విందూరు సమీపంలోని చెన్నూరు బిట్-2 మర్రిపల్లిమడుగు ప్రాంతంలోని ఒక తోటలో ఈ ఘటన జరిగింది. గూడూరు గ్రామీణ ఎస్సై తిరుపతయ్య తెలిపిన వివరాల ప్రకారం... ఆ తోటలోనే ఇద్దరు బాలల తల్లిదండ్రులు పనిచేస్తున్నారు. సమీపంలోనే చెన్నూరుకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు, సైదాపురం మండలానికి చెందిన పదిహేడేళ్ల బాలుడు ఇటీవల ఫోన్ చూస్తూ ఆడుకుంటున్నారు.
ఉన్నట్టుండి ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆగ్రహంతో పదిహేడేళ్ల బాలుడు గొంతు నులుమడంతో మరో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భీతిల్లిన ఆ బాలుడు.. మృతదేహాన్ని ఏం చేయాలో తెలియక తోటలోనే పూడ్చేశాడు. బాలుడు అదృశ్యమైనట్టు ఈనెల 17న తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మృతదేహం బయటపడింది. పోలీసులు విచారణలో పదిహేడేళ్ల బాలుడు తానే దారుణానికి పాల్పడ్డానని అంగీకరించాడు. సోమవారం బాలుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నెల్లూరులోని జువనైల్ హోంకు తరలించారు.


.webp)
.webp)


