Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కృష్ణలంకలో విషాదం.. సెల్ఫీ వీడియో తీసుకొని ఓ వ్యక్తి ఆత్మ హత్య
posted on: Jun 18, 2026 5:44PM

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో పెరుపోగు క్రాంతి కుమార్ (40) ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకుం టున్నట్లు క్రాంతి కుమార్ ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో లో పేర్కొన్నారు. గత మూడు నెలలుగా తనను తీవ్రంగా వేధించారని, పలు మార్లు కొట్టారని, ఆ వేధింపు లను భరించలేక ఆత్మహత్య కు పాల్పడుతున్నట్లు వీడియోలో వెల్లడించారు.
మే 21 ఉదయం పోలీసులు ఇంటికి రావడంతో క్రాంతి కుమార్ విషపదార్థం తీసుకున్నారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మరణించారు. ఈ ఘటనపై క్రాంతి కుమార్ తండ్రి పెరుపోగు వెంకటేశ్వర రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, క్రాంతి కుమార్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా వారు విడివిడిగా నివసిస్తున్నారు. అలాగే క్రాంతి కుమార్ పై గతంలో కొన్ని కేసులు నమోదై ఉండగా, కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్, రౌడీ షీట్లు కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొ న్నారు.
ఈ నేపథ్యంలోనే పోలీసులు తరచు క్రాంతి ఇంటికి వచ్చేవారిని,సీఐ నాగరాజు వేధింపులు భరించలేకే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని క్రాంతి కుమార్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, క్రాంతి కుమార్ మరణానికి ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో ఈ కేసులో కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. సెల్ఫీ వీడియోతో పాటు ఇతర ఆధారాలను కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.






