Latest News

అమెరికాకు ఎదురుదెబ్బ.. ఇరాన్ దాడిలో దెబ్బతిన్న శక్తిమంతమైన యుద్ధ విమానం

posted on: Mar 20, 2026 8:42AM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి.  ఇరాన్ పై యుద్ధంలో అమెరికాకు తేరుకోలేని దెబ్బతగిలింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానంగా పేరుగాంచిన అమెరికా ఎఫ్-35 లైట్నింగ్   విమానం ఇరాన్‌ దాడిలో దారుణంగా దెబ్బతింది. ఇరాన్ పై ఆపరేషన్ నుంచి తిరిగివస్తుండగా.. ఇరాన్ దళాలు జరిపిన కాల్పుల్లో విమానం దెబ్బతిన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో పైలట్ ఆ విమానాన్ని పశ్చిమాసియాలోని  అమెరికా సైనిక స్థావరంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. గత నెలలో యుద్ధం మొదలైన తరువాత అమెరికా యుద్ధ విమానం నేరుగా ఇరాన్ లక్ష్యంగా దాడికి పాల్పడిన ఘటన  ఇదే మొదటిది. ఈ మొదటి దాడిలోనే అమెరికా అమ్ములపొదిలోనే అత్యంత శక్తిమంతమైన విమానం దెబ్బతినడం గమనార్హం. 

 100 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 800 కోట్ల రూపాయలకు పైగా విలువైన విమానం దెబ్బతినడంతో అమెరికా రగిలిపోతోంది.  కాగా విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, పైలట్ క్షేమంగా ఉన్నారని అమెరికా ప్రకటించింది. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 10 రీపర్ డ్రోన్లతో సహా 16 అమెరికా విమానాలు ధ్వంసమయ్యాయి.

కాగా తన ఎఫ్ 35లైట్నింగ్ విమానం దెబ్బతినడంపై స్పందించిన అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతంగా సాగుతోందని, యుద్ధంలో గెలుస్తున్నామని పేర్కొంది. మునుపెన్నడూ లేని అతి పెద్ద వైమానిక దాడిని ఇరాన్ ఎదుర్కొంటుందని హెచ్చరించింది.    అమెరికా హెచ్చరికల నేపథ్యంలో  ఇరాన్ తన ఎస్-400,  బావర్-373  గగనతల రక్షణ వ్యవస్థలను యుద్ధ ప్రాతిపదికన మొహరించింది. అమెరికా విమానాన్ని తామే దెబ్బతీశామంటూ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అధికారికంగా ధృవీకరించింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...