తెలంగాణలో 8 మంది మావోలు లొంగుబాటు

posted on: Jan 24, 2026 3:18PM

 

పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట ఎనిమిది మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన మావోలకు ప్రభుత్వ పునరావాస పథకం ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కమీషనర్ హామీ ఇచ్చారు. చట్ట వ్యతిరేక మార్గాలను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. 

మిగిలిన మావోయిస్టులంతా ఆయుధాలు వదిలి లొంగిపోవలని కోరారు. ప్రశాంత జీవనం గడపాలని సూచించారు. మార్చి నాటికి మావోయిస్టు రహితంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆపరేషన్‌ కగార్‌ను ప్రారంభించారు. ఆపరేషన్‌ కగార్‌ దెబ్బతో గత కొంతకాలంగా మావోయిస్టులు భారీ సంఖ్యలో అడవుల్ని వీడి.. జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. అదే సమయంలో  ఎన్‌కౌంటర్‌లు కూడా కొనసాగుతున్నాయి.  మావోయిస్టుల ఏరివేతలో భాగంగా అధిక సంఖ్యలో మావోలు లొంగిపోతున్నారు
 

google-ad-img
    Related Sigment News
    • Loading...