Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డయాబిటిస్ ని ఓడించిన 69 ఏళ్ల భామ… సారీ బామ్మ!
posted on: Jun 6, 2017 11:49AM

ఆమెకు కూడా అందరిలాగే డాక్టర్లు షుగర్ వచ్చే ప్రమాదం వుందని చెప్పారు. కాని, ఆమె అందరిలాగా టెన్షన్ పడిపోయి మందులు మింగేస్తూ ఎడాపెడా స్వీట్లు, రైస్ తినేయలేదు! పట్టుదలగా షూగర్ మానేసింది. దానికి బదులు జిలిటాల్ అనే తియ్యటి ప్రత్యామ్నాయం ఎంచుకుంది. ఇది సహజంగా పళ్ల వంటి వాటిల్లో లభిస్తుంది. అయితే, కృత్రిమంగా తయారు చేసి కూడా అమ్ముతుంటారు. జిల్ టాల్ వాడదలచిన ఆమె పూర్తిగా షూగర్ మానేసి రెగ్యులర్ ఎక్స్ ర్సైజు మొదలెట్టింది. ఇంకేముంది, ప్రీ డయాబిటిస్ అన్న డాక్టర్లు ఆమెకు ఇప్పటి వరకూ డయాబిటిస్ వచ్చిందని చెప్పనే చెప్పలేదు! కాకపోతే, మీకు అసలు విషయం చెప్పలేదు కదూ… ఆమెకిప్పుడు 69ఏళ్లు, 4గురు మనవళ్లు, మనవరాళ్లు! 26ఏళ్ల కిందట ఆమెకి డయాబిటిస్ ప్రమాద గంటిక మొగింది! అప్పట్నుంచీ ఆమె షూగర్ ను , షూగర్ వ్యాధిని పూర్తిగా జయించింది!
ఆస్ట్రేలియాలోని పెర్త్ కు చెందిన కరోలిన్ హార్ట్స్ అనే ఈ స్త్రీ లాంటి వారు బోలెడు మంది వుంటారు. డయాబిటిస్ ను జయించి నిలుస్తుంటారు. కాని, ఈమెలోని విశేషం అది మాత్రమే కాదు! 69ఏళ్ల వయస్సులో కూడా కరోలిన్ బికిన్ వేసుకుని ఫోజులిచ్చి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తే అవ్వి వైరల్ అయ్యాయి! ఎందుకంటే, 26ఏళ్లుగా షూగర్ మానేసి, వ్యాయామం మొదలుపెట్టిన ఆమె సగానికి సగం యవ్వనంగా కనిపిస్తోంది! అదీ అందర్నీ ఆకట్టుకుంటోన్న యంగ్ అండ్ బ్యూటిఫుల్ సీక్రెట్!
నిజంగా చక్కెర మానేస్తే … ఇంకో నెలలో డెబ్బై ఏళ్లు వచ్చేస్తాయన్నా.., జాలీగా తిరగొచ్చా? ఖచ్చితంగా అంటోంది కరోలిన్! షూగర్ ఫ్రీ బేకింగ్ అనే బుక్ కూడా రాసిన ఆమె ఆస్ట్రేలియాలో జిలిటాల్ ప్రవేశపెట్టిన బిజినస్ వుమన్ గా కూడా రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు షూగర్ కాని, షూగర్ బారిన పడనివ్వనీ… తియ్యటి జిలిటాల్ అమ్ముకుంటూనే హ్యాపీగా, హెల్తీగా బతికేస్తుంది ఈ భామ… సారీ బామ్మ!



.jpg)


