ఫుడ్ పాయిజినింగ్.. 50 మందికి అస్వస్థత

posted on: May 16, 2026 9:32AM

గుంటూరు జిల్లాలో ఫుడ్‌ పాయిజన్‌   తీవ్ర కలకలం రేపింది. పాడైపోయిన ఆహారాన్ని తిన్న 50 మంది గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు.  వెళ్తే.. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో బుధవారం( మే 14)  ఓ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకలో అతిథులకు భోజనాలు వడ్డించారు. అయితే, ఆ రోజు ఫంక్షన్‌లో మిగిలిన బిర్యానీని మరుసటి రోజు అంటే గురువారం( మే 15) కొందరు గ్రామస్థులు తిన్నారు.

 దీంతో.. అదే రోజు రాత్రి నుంచి దాదాపు 50 మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర  అస్వస్థతకు గురయ్యారు.   వారిలో 44 మంది కోలుకోగా.. మరో ఆరుగురిని స్థానికులు తెనాలి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్‌పాయిజన్‌ సమాచారం అందుకున్న వెంటనే..  డీఎంహెచ్‌వో విజయలక్ష్మి కొత్తరెడ్డిపాలెం గ్రామాన్ని సందర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని స్థానిక వైద్యారోగ్య సిబ్బందిని ఆదేశించారు.  ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...