Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కౌన్ బనేగా యూపీ సీఎం?
posted on: Mar 11, 2017 2:52PM
.jpg)
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ భారీ విజయం సాధించడంతో... ఇప్పుడు అందరి మెదళ్లను ఒక్కటే ప్రశ్న తొలుస్తోంది. యూపీ నెక్ట్స్ సీఎం ఎవరూ అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు.... సీఎంను నిర్ణయించనుండటంతో ఎవరిని లక్కీ ఛాన్స్ వరిస్తుందని కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పదిహేనేళ్ల తర్వాత అధికారం దక్కడంతో ఎవరిని సీఎంగా నియమించాలనే దానిపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు చర్చిస్తోంది. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పార్టీ భారీ మెజార్జీ సాధించడంలో మౌర్య కీలక పాత్ర పోషించారు. అభ్యర్ధుల ఎంపిక నుంచి ప్రచారం వరకు మౌర్య చక్కగా లీడ్ చేయడంతో పార్టీ అధిష్టానం దగ్గర మంచి మార్కులు పడ్డాయి. అయితే అతను ఈమధ్యే బీఎస్పీ నుంచి వచ్చి చేరడంతో పార్టీలో కాస్త వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మౌర్యతో పాటు...పార్టీ సీనియర్ నేత, ఎంపీ యోగి ఆదిత్యనాథ్ కూడా సీఎం రేసులో పోటీ పడుతున్నారు. గోరఖ్ పూర్ నుంచి పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న యోగి ఆదిత్యనాథ్.. హిందూ యువ వాహిని సంస్థను కూడా రన్ చేస్తున్నారు. గోరఖ్ నాథ్ మఠానికి మహంత్‌గా పనిచేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు సిద్ధార్థ్ నాథ్ సింగ్ పేరు కూడా సీఎం రేసులో వినిపిస్తోంది. పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న సిద్ధార్థ్ నాథ్ సింగ్.. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు కావడం విశేషం. వీరితోపాటు... కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేరు కూడా నానుతోంది. యూపీకే చెందిన రాజ్ నాథ్.. ప్రధాని మోడీకి సన్నిహితుడిగా.. పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. మరి పార్టీ పార్లమెంటరీ బోర్డు ఎవరిని సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తుందో త్వరలో తేలిపోనుంది.


.jpg)



