Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మోదీ కొత్త నోట్లు.. బీజేపికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయా?
posted on: Mar 11, 2017 12:44PM
.jpg)
నోట్ల రద్దు... ఇక మీదట ఈ విషయం రద్దైపోయినట్టేనా? యూపీలో ఫలితాలు చూశాక అలాగే అనిపిస్తోంది! నవంబర్ లో మొదలైన నోట్ల రద్దు గోల డిసెంబర్, జనవరిల్లో ఉధృతంగా నడిచింది. ఫిబ్రవరీలో తగ్గు ముఖం పట్టింది. అయినా ఇటు మీడియా, అటు అరవింద్ కేజ్రీవాల్, మమతా, కాంగ్రెస్ నేతలు అందరూ ఇంకా వీలైనప్పుడల్లా రభస చేస్తూనే వున్నారు! కాని, ఎన్నికల తరువాత ఎన్నికలు మోదీ నోట్ల రద్దు విషయాన్ని ప్రజలు కోపగించుకోలేదని నిరూపిస్తున్నాయి!
యూపీలో గెలుపు లోకల్ అంశాల మీదే తప్ప డీమానిటైజేషన్ గురించి కాదని కొందరు వాదించవచ్చు. అది కరెక్టే! కాని, నవంబర్ లో పెద్ద నోట్లు రద్దైన వెంటనే రెండు మూడు చోట్ల పార్టమెంట్ కు ఉప ఎన్నికలు వచ్చాయి. అక్కడెక్కడా బీజేపి తన పాత స్థానాల్ని కోల్పోలేదు! ఇక ఆ తరువాత వరుసగా మున్సిపల్ ఎన్నికలు కూడా వచ్చాయి. ముంబై లాంటి అతి సంపన్నమైన మున్సిపాలిటి కూడా బీజేపి వశమైంది! ఇవే కాకుండా ఎప్పుడూ లేనిది ఒరిస్పా రాష్ట్రంలో గ్రామ స్థాయిలో కమల వికాసం జరిగింది! వందల సంఖ్యలో గ్రామ పంచాయితీలు కొన్నాళ్ల క్రితమే బీజేపి ఖాతాలో పడ్డాయి!
నవంబర్ నుంచి ఇప్పటి దాకా , అంటే, గత అయిదు నెలల్లో గ్రామ పంచాయితీ నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా అన్ని ఎలక్షన్సూ జరిగాయి! ప్రతీ స్థాయి ఓట్ల యుద్ధంలో కూడా మోదీ, బీజేపి విజయఢంకాని ఎవ్వరూ నిరోధించలేకపోతున్నారు! మరీ ముఖ్యంగా, నోట్లు రద్దై ఇక్కట్లు పడ్డ జనం మోదీకి బుద్ది చెబుతారని ఆశించిన ప్రతి పక్ష నేతలు ఏమాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు! సో... ఇక డీమానిటైజేషన్ కథ కంచికే అనుకోవాలి!



.jpg)


