Latest News

చలవపందిరి కూలి 15 మంది భక్తులకు గాయాలు.. కొండగట్టు ఆంజన్న ఆలయంలో అపశ్రుతి

posted on: Apr 1, 2026 12:31PM

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద అపశృతి చోటుచేసుకుంది. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిరి అకస్మాత్తుగా కూలిపోవడం తో సుమారు 15 మంది భక్తులు తీవ్రంగా గాయప డ్డారు.హనుమాన్ విజయో త్సవం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు.

ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో తాత్కాలికంగా చలువ పందిరి ఏర్పాటు చేశారు. అయితే అలా ఏర్పాటు చేసిన చలవ పందిరి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో గాయపడిన భక్తులను హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించారు.

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒకింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  చలువపందిరి కూలిన ఘటనపై భక్తులు   ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకంగా ఈ చలువపందిరి వేయడం వల్లనే కుప్పకూలిందని ఆరోపిస్తున్నారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చలువ పందిరి కూలిన ఘటనపై వాచారణ చేపట్టారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...