అమరావతిలో కొత్తగా 41 కంపెనీలు ... 41 వేల మందికి ఉపాధి

posted on: Feb 10, 2026 2:21PM

 

రాజధాని అమరావతిలో పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. తాజాగా జరిగిన మంత్రులు- కార్యదర్శుల సమావేశం సందర్భంగా విడుదల చేసిన నివేదికలో రాజధాని అమరావతిలో పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పన అంశాలపై ప్రభుత్వ కృషిని వివరించారు. అమరావతిలో 41 కంపెనీలు రాబోతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఆయా కంపెనీలు రూ. 48,711 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాయి. 41,625 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని నివేదిక చెబుతోంది. 

ఇప్పటికే మెమోరాండం ఆఫ్‌ అండర్‌ స్టాండిగ్స్‌(ఎంఓయూ)లు పూర్తయిపోయాయి. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక బోర్డు(ఎస్‌ఐపీబీ) ఆమోద ముద్ర కూడా వేసిందని నిదేదిక పేర్కొంది. రాజధాని అమరావతిలో రూ.4,700 కోట్లతో గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 4,500 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించనున్నారు. 

ఇందుకు సంబంధించి భూ సమీకరణ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. కాగా అమరావతిలో ఇప్పటి వరకూ 9 జాబ్‌ మేళాలు నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గంలో 7 జాబ్‌మేళాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోగా మొత్తం 9 జాబ్‌ మేళాలు నిర్వహించారు. వీటిలో 580 కంపెనీలు పాల్గొన్నాయి. వీటి ద్వారా 5,984 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్లు నివేదిక తెలుపుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...