Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హోర్మూజ్ పై 35 దేశాల చర్చలు.. భారత్‌కు ఆహ్వానం
posted on: Apr 3, 2026 10:45AM

హోర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఈ విషయమై చర్చించేందుకు శుక్రవారం(ఏప్రిల్ 3) 35 దేశాలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో పాల్గొనాలంటూ భారత్‌కు ఆహ్వానం అందింది. హెర్మూజ్ పై జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ యూకే నుంచి భారత్ కు ఆహ్వానం అందిందని భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది.
భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ సమావేశంలో పాల్గొంటారని ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. భారత్ ఇప్పటికే ఇరాన్‌తో పాటు ఇతర దేశాలతో ఈ విషయమై చర్చలు జరుపుతోందన్న ఆయన.. హోర్ముజ్ మీదుగా సరకు రవాణాకు అంతరాయం కలగకుండా తమ వంతు ప్రయాత్నాలను చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయన్నారు. భారత్‌కు చెందిన ఆరు నౌకలు సురక్షితంగా హోర్ముూజ్‌ను దాటగలిగాయని అన్నారు.
తాజాగా శుక్రవారం జరగే ఈ సమావేశంలో భారత్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, జపాన్, ఇటలీ తదితర దేశాలు పాల్గొంటున్నాయని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలిస్తామని తెలిపారు. హోర్ముజ్ జలసంధి మీదుగా ఎవరి ముడి చమురును వారే తెచ్చుకోవాలని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొంటూ ఎల్లకాలం అమెరికా సాయంగా రాదన్న నేపథ్యంలో ఈ సమావేశం జరగడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.


.webp)
.webp)


