Latest News

మ్యూజిక‌ల్ హిట్ `గోవిందా గోవింద‌`కి 28 ఏళ్ళు!

posted on: Jan 21, 2022 2:09PM

!

మ్యూజిక‌ల్ హిట్స్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన నిర్మాణ సంస్థ‌ల్లో వైజ‌యంతీ మూవీస్ ఒక‌టి. అలా.. వైజ‌యంతీ సంస్థ నుంచి వ‌చ్చిన మ్యూజిక‌ల్ హిట్స్ లో `గోవిందా గోవింద‌`కి ప్ర‌త్యేక స్థాన‌ముంది. `శివ‌` (1989) వంటి ట్రెండ్ సెట్ట‌ర్ తో తెలుగునాట సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కింగ్ నాగార్జున‌, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్ లో రూపొందిన మూడో తెలుగు చిత్ర‌మిది. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాలో ప‌రేష్ రావెల్, కోట శ్రీ‌నివాస‌రావు, గుమ్మ‌డి, జేవీ సోమ‌యాజులు, అరుణ్ గోవిల్, య‌మున‌, సుధాక‌ర్, సూర్య‌కాంతం, ఉత్తేజ్, అన్న‌పూర్ణ‌, మాస్ట‌ర్ అనిల్ రాజ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌గా.. సిల్క్ స్మిత ఓ పాట‌లో త‌ళుక్కున మెరిసింది.

రాజ్ - కోటి సంగీత సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. ``అంద‌మా అందుమా``, ``అమ్మ‌ బ్ర‌హ్మ దేవుడో``, ``ఓ న‌వీనా న‌వీనా``, ``ప్రేమంటే ఇదంటూ``, ``ఇందిర మందిర‌``.. ఇలా ఇందులోని పాట‌ల‌న్నీ అటు సాహిత్య‌ప‌రంగానూ, ఇటు సంగీతం ప‌రంగానూ మెప్పించాయి. దిగ్గ‌జ ర‌చ‌యిత‌లు వేటూరి సుంద‌ర‌రామ్మూర్తి, సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి ఈ గీతాల‌కు సాహిత్య‌మందించారు. 1994 జ‌న‌వ‌రి 21న విడుద‌లై మ్యూజిక‌ల్ హిట్ గా నిలిచిన `గోవిందా గోవింద‌`.. నేటితో 28 వ‌సంతాలు పూర్తిచేసుకుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...