Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పవన్ ఎంట్రీతో..జగన్ క్లీన్‌స్వీప్
posted on: Mar 14, 2017 8:10PM
.jpg)
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ 65 సీట్లు గెలుచుకుంటుందని లెక్కగట్టిన ఓ సర్వే సంస్థ.... ఏ జిల్లాలో ఎన్ని సీట్లు గెలుస్తుందో క్లారిటీ ఇచ్చింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా వేసింది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో గణనీయమైన సీట్లు గెలుచుకుంటుందన్న సర్వే సంస్థ..... తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం దాదాపు క్లీన్ స్వీప్ చేస్తుందని చెబుతోంది. పది సీట్లున్న శ్రీకాకుళం జిల్లాలో ఐదు, అలాగే 9 స్థానాలున్న విజయనగరం జిల్లాలో నాలుగు సీట్లు గెలుచుకుంటుందని లెక్కగట్టింది. ఇక 15 సీట్లున్న విశాఖ జిల్లాలో అత్యధికంగా 9 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే సంస్థ అంచనా వేసింది.
ఇక పవన్ కల్యాణ్ కులస్తులు అధికంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేస్తుందని అంచనా వేసింది. 19 స్థానాలున్న తూర్పుగోదావరిలో అత్యధికంగా 15 సీట్లు కైవసం చేసుకుంటుందని, అలాగే 15 సీట్లున్న పశ్చిమగోదావరిలో ఏకంగా 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని లెక్కగట్టింది. ఇక కాపులు గణనీయంగా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ జనసేన సత్తా చాటుతుందని, కృష్ణాజిల్లాలో ఆరు చోట్ల, గుంటూరు జిల్లాలో ఐదు సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది. అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తలో మూడు సీట్లు గెలుచుకుంటుందని తేల్చింది.
అయితే వైసీపీకి బాగా పట్టున్న రాయలసీమలో జనసేన ప్రభావం అంతగా ఉండదని సర్వే సంస్థ తేల్చింది. కడప, కర్నూలు, అనంతపురంలో జనసేన అసలు బోణీ కూడా కొట్టదని చెప్పింది. అయితే కాపు, బలిజ కులస్తులు కొంచెం అధికంగా ఉన్న చిత్తూరు జిల్లాలో మూడు సీట్లు గెలిచే అవకాశముందని అంచనా వేసింది. మొత్తానికి 175 స్థానాల్లో ఉన్న ఏపీలో 65 సీట్లు గెలుచుకుని రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరిస్తుందని తెలిపింది.
ఈ సర్వే నిజమయితే ఆంద్ర లో హంగ్ తప్పదు. మరి అప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారు ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సహజం గా కొత్త పార్టీ వచ్చినప్పుడు ప్రతిపక్షానికే ఆ దెబ్బ తగులుతుంది ..చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్‌కి దెబ్బ పడింది. అలాగే చెన్నై లో విజయ్ కాంత్ పార్టీ పెట్టినప్పుడు ఏఐఏడీఎంకే కి దెబ్బ పడింది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ లో పవన్ పార్టీ ఎంట్రీ తెలుగు దేశం కి ప్లస్ అవుతుందా ?



.jpg)


