2002 గుజరాత్ మారణహోమంలో కీలక తీర్పు..

posted on: Jun 2, 2016 5:46PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుల్బర్గ్ సోసైటీ హత్యాకాండ కేసులో అహ్మదాబాద్ ప్రత్యేకకోర్టు తుదితీర్పును వెలువరించింది. సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం ఘర్షణలు జరిగిన 14 ఏళ్ల తరువాత తీర్పు చెప్పింది. విచారణను ఎదుర్కొంటున్న వారిలో 24 మందిని దోషులుగా నిర్థారించగా, మరో 36 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. 2002 ఫిబ్రవరి 27వ తేదీన గోద్రా స్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలకు నిప్పుపెట్టగా 59 మంది మరణించారు. సరిగ్గా ఆ తర్వాతి రోజున గుల్బర్గ్ సోసైటీ ప్రాంతంలో ఒక వర్గం లక్ష్యంగా దాదాపు 20 వేల మంది ఆ ప్రాంతంపై దాడి చేశారు. ఈ దాడిలో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీని ఇంటిలోంచి బయటకు లాక్కొచ్చి మరీ నరికేసి, తగలబెట్టారు. పోలీసులకు, సీనియర్ నాయకులకు సాయం కోసం ఫోన్లు చేసినా ఎవరూ అప్పట్లో ఆ ఫోన్లు ఆన్సర్ చేయలేదన్న ఆరోపణలున్నాయి. జరిగిన ఘటనపై ఎంపీ భార్య జకియా జాఫ్రీ న్యాయం చేయాలంటూ ఇన్నేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు.

 

నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, ఇతర మంత్రుల పాత్ర కూడా అల్లర్లలో ఉందని ఆమె ఆరోపించారు. దిగువ కోర్టులో న్యాయం జరగకపోవడంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో ఈ ఘటనపై విచారణ కోసం సుప్రీం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. సిట్ అందజేసిన నివేదికలో అనేక వాస్తవాలు బయటకు వచ్చాయి. బాధితులు సజీవ దహనం చేశారనడానికి అక్కడ లభించిన మృతదేహాలే సాక్ష్యమని, అవన్నీ పూర్తిగా కాలిపోయాయని తెలిపింది. పెట్రోల్ క్యాన్లు, కర్రలు, కత్తులు కూడా ఘటనా స్థలంలో దొరికాయాని, దాన్ని బట్టి అక్కడ మారణ హోమం ఏ స్థాయిలో జరిగిందో వివరించింది. సిట్ నివేదిక ఆధారంగా అహ్మదాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...