Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫిఫా మీడియా హక్కుల పేర రూ.2 కోట్ల టోకరా.!
posted on: Jul 9, 2026 11:26AM

ఫిఫా వరల్డ్ కప్ 2026 మీడియా హక్కుల పేరుతో భారీ పెట్టుబడులు పెట్టిస్తామని నమ్మించి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సంస్థను కోట్ల రూపాయల మేర మోసం చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై హైదరాబాద్ సీసీఎస్ ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
హైదరాబాద్‌కు చెందిన మెటాలాయిడ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతిష్ కొల్లాటి ఫిర్యాదు మేరకు దీలీప్ మాస్కే అలియాస్ శామ్‌తో పాటు మరికొందరిపై మోసం, నకిలీ పత్రాల వినియోగం, క్రిమినల్ కుట్ర తదితర ఆరోపణలపై కేసు నమోదైంది.
ఫిర్యాదు ప్రకారం, ఫిఫా వరల్డ్ కప్ 2026 భారత ఉపఖండ మీడియా హక్కుల కోసం మెటాలాయిడ్ సంస్థ బిడ్ దాఖలు చేసి, తదుపరి ప్రక్రియల్లో భాగంగా భారీ పెట్టుబడిదారుల కోసం ప్రయత్నించింది. ఈ సమయంలో అమెరికాకు చెందినvni LLC సంస్థ ప్రతినిధినని చెప్పుకున్న దీలీప్ మాస్కే, తమ సంస్థ 50 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉందని నమ్మించాడు. ఇందుకు మద్దతుగా విదేశీ బ్యాంకు ఖాతాలు, కార్పొరేట్ గ్యారంటీలు, ఆర్థిక హామీలకు సంబంధించిన పలు పత్రాలను అందజేశాడు.
అంతేకాకుండా స్విట్జర్లాండ్‌లోని యూబీఎస్ బ్యాంకులో భారీ మొత్తంలో నిధులు ఉన్నట్లు చూపిస్తూ బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఎస్క్రో ఖాతా వివరాలు, ఇతర ఆర్థిక పత్రాలు కూడా సమర్పించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పత్రాలను నమ్మిన మెటాలాయిడ్ సంస్థ షేర్‌హోల్డర్స్ అగ్రిమెంట్, ప్రాజెక్ట్ గవర్నెన్స్ ఒప్పందాలు సహా పలు ప్రక్రియలను పూర్తి చేసింది. అయితే అనంతరం నిర్వహించిన డ్యూ డిలిజెన్స్‌లో సమర్పించిన బ్యాంకు పత్రాలు, గ్యారంటీలు, ఖాతా వివరాలు నకిలీవని తేలింది. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన సంస్థ ప్రతినిధులు నేరుగా సంబంధిత బ్యాంకును సంప్రదించగా, పత్రాల్లో పేర్కొన్న వివరాలు తమ రికార్డుల్లో లేవని స్పష్టం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వ్యవహారం కారణంగా సంస్థ దాదాపు 2 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని, ఆర్థిక నష్టంతో పాటు సంస్థ ప్రతిష్ఠ కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఫిర్యాదుదారు తన ఫిర్యాదు లో తెలిపారు. అంతేకాకుండా ఫిఫా మీడియా హక్కులు తమకే వచ్చాయని చెబుతూ నకిలీ ప్రచార సామగ్రి, ఎడిట్ చేసిన ఫొటోలు, తప్పుడు ప్రకటనల ద్వారా మరింత మందిని మోసం చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, ఈ వ్యవహారంపై ఫిఫా కూడా స్వతంత్రంగా దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. పెట్టుబడుల పేరుతో అంతర్జాతీయ స్థాయిలో నకిలీ పత్రాలు వినియోగించి మోసానికి పాల్పడిన కోణంలో అధికారులు లోతుగా విచారణ కొనసాగి స్తున్నారు.
Avni LLC, UBS, EOW, Hyderabadccspolice, Case, Teluguone


.webp)
(8).webp)


