సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబంలో 18 మంది మృతి

సౌదీ అరేబియాలో  సోమవారం (నవంబర్ 17) తెల్లవారు జామున జరిగిన జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు మరణించినట్లు తెలంగాణ హజ్ కమిటీ అధికారికంగా ధృవీకరించింది. పవిత్ర ఉమ్రా యాత్రకు వెళ్లిన వీరి ప్రయాణం విషాదాంతంగా ముగియడం పట్ల విచారం వ్యక్తం చేసింది  మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ఉండటం అందరినీ తీవ్రంగా కలచివేస్తోంది.

ఈ దుర్ఘటనతో హైదరాబాద్ నగరంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. ఇలా ఉండగా  హైదరాబాద్ లోని రాంనగర్ లో నివసించే నసీరుద్దీన్ కుటుంబానికి చెందిన 18 మంది సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కుటుంబ యజమాని నసీరుద్దీన్ 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఆయన కుమారుడు సిరాజుద్దీన్   ఉద్యోగరీత్యా  అమెరికాలో ఉంటుండటంతో ఆయన ఒక్కరే ఈ యాత్రకు వెళ్లలేదు. ఇప్పుడు ఈ ఘోర ప్రమాదంలో సిరాజుద్దీన్ కుటుంబ సభ్యులందరినీ కోల్పోయి ఒంటరివాడయ్యారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu