ఘోర రోడ్డు ప్రమాదం.. 25 మంది మృతి
posted on Nov 3, 2025 8:41AM
.webp)
హైదరాబాద్ సమీపంలో సోమవారం (నవంబర్ 3) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వస్తుండగా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో కంకర లోడుతో అతి వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 70 మంది ప్రయాణీకులు ఉన్నట్లు చెబుతున్నారు. బస్సులో ఉన్నవారిలో ఎక్కువ మంది విద్యార్థులే అని చెబుతున్నారు. ఆదివారం (నవంబర్ 2) సెలవు కావడంతో సొంత ఊళ్లకు వెళ్లి.. తిరిగి సోమవారం (నవంబర్3) హైదరాబాద్‌లోని కాలేజీలకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.