అంబటిపై 16 క్రిమినల్ కేసులు

posted on: Feb 2, 2026 8:34AM

అంబటి రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి. పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, సమాజంలో ఉద్రిక్తతలు పెంచడమే లక్ష్యంగా అంబటి తీరు ఉంది. ఈ విషయాలను పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

గత కొద్ది నెలలుగా ఆయన పలు సందర్భాలలో వివాదా స్పద వ్యాఖ్యలు చేశారని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుపై అసభ్య పదజాలంతో దూషణలు చేసిన విషయాన్ని కూడా ఆ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. అంబటి తీరు, వ్యవహారశైలి కారణంగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని పేర్కొన్నారు.   పోలీసుల రిమాండ్ రిపోర్టు లోని అంశాలను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు అంబటి తరఫు న్యాయవాది వాదనలను పూర్వపక్షం చేస్తూ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...