జూబ్లీ బైపోల్.. అమలులోకి 144 సెక్షన్
posted on Nov 10, 2025 9:18AM
.webp)
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మంగళవారం (నవంబర్ 11) పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రచారం ఆదివారం (నవంబర్ 9)తో ముగిసిన సంగతి విదితమే. ఇక ఇప్పుడు అధికారులు పూర్తిగా లా అండ్ ఆర్డర్ పై దృష్టి సారించారు.
ఆదివారం (నవంబర్ 9) సాయంత్రం నుంచీ.. మంగళవారం (నవంబర్ 11) సాయంత్రం పోలింగ్ ముగిసే సమయం వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, క్లబ్బులు, స్టార్ హోటళ్లలోని బార్లు మూసి ఉంటాయని తెలిపారు. ఎక్సైజ్ చట్టం 1968, సెక్షన్ 20 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంవ నియోజకవర్గ పరిధిలో 144వ సెక్షన్ విధించారు. దీని ప్రకారం ఐదుగురి కంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడంపై నిషేధం ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హైచ్చరిక జారీ చేశారు.
ఇలా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ విపరీతంగా పెరిగింది. ఈ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, బీజేపీ క్యాండిడేట్ గా లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉణ్న సంగతి తెలిసిందే. గ్రేటర్ పరిధిలో సత్తా చాటాలనీ కాంగ్రెస్, చాటుకోవాలని కాంగ్రెస్, పట్టు నిలుపుకుని, సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీజేపీ, రాష్ట్రంలో మరింత బలోపేతం కావడానికి బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.