Latest News

తిరుపతిలో చిన్నారి కిడ్నాప్

posted on: Jan 22, 2026 11:06AM

తిరుపతిలో 13 నెలల చిన్నారి కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది.   తమిళనాడు నుండి వచ్చి తిరుపతిలో నివాసం ఉంటున్న దంపతులు తమ ఇంటి పక్కనే ఉంటున్న ఒక చిన్నారిని కిడ్నాప్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.

తిరుపతికి చెందిన మునిరెడ్డి స్థానిక చింతలచేను రోడ్డులో ని ఓ కిరాయి ఇంటిలో నివాసం ఉంటున్న  సుచిత్ర, మస్తాన్ దంపతులు 13 నెలల శిశువు బుధవారం (జనవరి 21) కిడ్నాప్ నకు గురైంది.   సుచిత్ర, మస్తాన్ దంపతులు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే నివాసం ఉండే  తమిళనాడుకు చెందిన మురుగన్, మారెమ్మ దంపతులు  నిన్న బాలికను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణలో మారెమ్మకు మురుగన్ నాలుగో భర్త అని తేలింది.   కిడ్నాపర్లు కాంచీపురం వెళ్లినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు వారి  కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...