ట్రక్కు ఢీకొని 11 మంది సజీవదహనం..యూపీలో ఘోర ప్రమాదం

posted on: Apr 23, 2026 8:55AM

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలోనిన్న రాత్రి ఘోర ప్రమాదం సంభవించిందిా.   బ్రేకులు ఫెయిలైన ఓ భారీ ట్రక్కు అదుపుతప్పి వరుసగా వాహనాలను ఢీకొనడంతో జరిగిన  ప్రమాదంలో 11 మంది  సజీవ దహనమయ్యారు. డ్రమ్మాండ్‌గంజ్ లోయ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.  నిన్న రాత్రి ఎనిమిదిన్నర   గంటల సమయంలో ద్రమాండ్‌గంజ్ ఘాట్ రోడ్డు మీదుగా లసోడా వైపు వెళ్తున్న ఓ ట్రక్కుకు  బ్రేకులు ఫెయిలయ్యాయి.  దీంతో డ్రైవర్ అదుపు కోల్పోయిన ఆ వాహనం ముందు వెళ్తున్న కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి మధ్యలో ఉన్న ఒక ఆల్టో కారు నుజ్జునుజ్జు కాగా, ప్రయాణికులతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని కూడా  వాహనాన్ని ట్రక్కు బలంగా ఢీకొంది.

ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల్లో మంటలు చెలరేగాయి. ముఖ్యంగా బొలెరో వాహనం భారీ అగ్నికీలల మధ్య చిక్కుకోవడంతో లోపల ఉన్న ప్రయాణికులు బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో 11 మంది   సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. .

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో మృతుల గుర్తింపు ప్రక్రియ కష్టంగా మారింది.  ప్రమాదానికి గురైన వాహనాలు వేర్వేరు రాష్ట్రాలకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు బీహార్ రిజిస్ట్రేషన్‌తో ఉండగా, మరో కంటైనర్ మధ్యప్రదేశ్‌కు చెందినది. చిన్న కార్లు సోన్‌భద్ర,  మీర్జాపూర్ జిల్లాలకు చెందినవిగా నిర్ధారించారు. అతివేగం, సాంకేతిక లోపం ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...