Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఖైరతాబాద్‌లో 12 వేల ఓట్లు మాయం..ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు..!
posted on: Jul 3, 2026 6:17PM

ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయ దుమారం రేపుతోంది. ప్రీ-మ్యాపింగ్ దశలోనే సుమారు 10 వేల నుంచి 12 వేల వరకు ఓట్లు తొలగించారని ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ఎన్ని కల ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని విమర్శిం చారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహ రించడం లేదని, బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందని దానం నాగేందర్ ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు.
క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరించడం లేదని, బదులుగా తోచిన వారికి మాత్రమే దరఖాస్తు ఫారాలు అందిస్తున్నారని మండిపడ్డారు. బీఎల్వోల నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నామని, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయనున్నట్లు దానం నాగేందర్ వెల్లడించారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు ఎంతో కీలకమని, ఓటర్ల జాబితాలో అక్రమా లకు తావివ్వబోమని స్పష్టం చేశారు. దానం నాగేందర్ చేసిన ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






