జోగి రమేష్ ఇంటిపై దాడి కేసులో 11 మంది అరెస్టు

posted on: Feb 3, 2026 2:46PM

మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటిపై దాడి  కేసులో 40 మంది టీడీపీ నేతలపై  కేసు నమోదైంది.  వీరిలో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ వీరందరికీ స్టేషన్ బెయిలు మంజూరు చేసి విడుదల చేశారు.

 మంత్రి నారా లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనై ఆయన ఇంటిపై దాడి చేశారు.  రాళ్లు రువ్వి,  పెట్రోల్ బాంబులు విసిరారు.  ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన దాడికి పాల్పడిన వారిపై  కేసులు నమోదు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు 40 మంది నేతలపై  కేసులు నమోదు చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...