Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇన్ స్టా గ్రామ్ వేధింపులు.. టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
posted on: Apr 10, 2026 4:27PM
ఇన్ స్టా గ్రామ్ వేధింపులు భరించలేక టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హాయత్ నగర్ పరిధిలో జరిగింది. సినీమాలు, సోషల్ మీడియా ప్రభావం యువతను తప్పుదోవ పట్టిస్తు న్నదనడానికి తార్కానంగా ఈ సంఘటనను చెప్పుకోవచ్చు.
హయత్‌నగర్ పరిధిలోని కుంట్లూరు ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ బాలుడు, బాలికల మధ్య పరిచయం ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్ వరకూ వెళ్లింది. ఇదే అవకాశంగా తీసుకున్న ఆ బాలుడు బాలికను ఇన్ స్టాగ్రామ్ లో వేధించడం మొదలు పెట్టాడు. ఆ వేధింపులు భరించలేక ఆ బాలిక పలు మార్లు ఆ బాలుడిని మందలించింది.
అయినా ఫలితం లేకపోగా, ఇటీవలి కాలంలో ఆ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఆ వేధింపులకు తాళలేక టెన్త్ చదువుతున్న ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హైదరాబాదుకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.






