అవినీతి కేసుల్లో బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు పదేళ్ల జైలు
posted on: Feb 3, 2026 9:24AM

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు రెండు వేర్వేరు అవినీతి కేసులలో జైలు శిక్ష విధిస్తూ ఆ దేశ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసుల్లో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులకూ జైలు శిక్ష విధించింది. రాజుక్ న్యూ టౌన్ ప్రాజెక్టుకు సంబంధం ఉన్న ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు నమోదైన కేసుకు సంబంధించి కోర్టు షేక్ హసీనాతో పాటు ఆమె బంధువులకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
షేక్ హసీనాకు ఒక్కో కేసులో ఐదేళ్ల చొప్పున మొత్తం పదేళ్ల జైలు శిక్ష విధించారు. అలాగే షేక్ హసీనా మేనల్లుడు రద్వాన్ ముజిబ్ సిద్ధిక్, మేనకోడళ్లు తులిప్ రిజ్వానా సిద్ధిక్, అజ్మినా సిద్ధిక్‌లకు కూడా ఈ అవినీతి కేసుల్లో శిక్ష పడింది. ముజిబ్ సిద్ధిక్‌కు నాలుగేళ్లు, మేనకోడళ్లకు ఏడేళ్ల చొప్పున శిక్ష విధించారు. రాజుక్ న్యూ టౌన్ ప్రాజెక్టు కేసులో సరెండర్ అయిన ఖుర్షీద్ ఆలమ్‌కు ఏడాది జైలు శిక్ష విధించారు.






