Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మైక్రో ఫైనాన్స్ పేరుతో రూ.10 కోట్ల మోసం కేసు… సింగర్ మంగ్లీ సహా ఐదుగురిపై కేసు నమోదు
posted on: Apr 11, 2026 12:33PM

ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు, మరో ముగ్గురిపై హైదరాబాద్‌లో మోసం, బెదిరింపుల కేసు నమోదైంది. న్యాయవాది సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు మేరకు, మైక్రో ఫైనాన్స్ వ్యాపారం పేరుతో రూ.10 కోట్ల మేర మోసం జరిగింది. పెట్టుబడులు పెట్టిస్తామని నమ్మబలికి భారీ ఎత్తున మొత్తాన్ని వసూలు చేసి తిరిగి చెల్లించలేదని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ డబ్బు గురించి అడగడంతో ఒత్తిడి, బెదిరింపులు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆక్సిడెంట్ చేసి చంపిస్తాం అంటూ మంగ్లీ అనుచరులు బెదిరించారని సుబ్బారావు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పడం తో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


.webp)
.webp)


