భార‌త ఆర్ధిక విప్ల‌వాన్ని ప్ర‌పంచ నాయ‌కులు ఎలా గుర్తిస్తున్నారంటే?

posted on: Jun 8, 2026 6:50AM

ప్రపంచ ఆర్థిక మ్యాప్‌ను భారతదేశం మారుస్తోంది. కెనడా ప్రస్తుతం భారత్‌తో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది.  ఎందుకంటే..  భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది.  ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ కూడా ఇదే వాస్తవాన్ని నొక్కిచెప్పారు. భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది,  నరేంద్ర మోడీని స్వాగతించడానికి ఆస్ట్రేలియా ఎంతో ఆసక్తిగా ఉందన్నారాయ‌న‌. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు భారతదేశాన్ని సాంకేతికత, ఆవిష్కరణలలో కీలక భాగస్వామిగా పేర్కొన్నారు, ఇరు దేశాలు 16 ఒప్పందాలపై సంతకం చేసి సాంకేతికతను మెయిన్ పిల్ల‌ర్ గా చేసుకున్నాయి. 

భారతదేశం, అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం 99శాతం పూర్తయింది. కేవలం 1శాతం మాత్రమే మిగిలి ఉంది. అమెరికా రాయబారి సెర్గియో గోర్, ఈ ఒప్పందంపై వారాల వ్యవధిలోనే.. సంతకం కావచ్చని ప్రకటించారు.  భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో ఆర్థికంగా ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. కానీ కొద్ది సంవత్సరాల్లోనే జర్మని, జపాన్‌లను మించి మూడవ స్థానానికి చేరుకోబోతోంది. ఐఎమ్ఎఫ్, ఎస్ అండ్ పీ గ్లోబ‌ల్ రేటింగ్స్ ప్రకారం, భారతదేశం 2028 నాటికి 5 ట్రిలియన్ డాల‌ర్ల‌ జీడీపీ సాధించి, 2030 నాటికి  7.3 ట్రిలియన్ డాల‌ర్ల‌కు చేరుకోనుంది. ఈ వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 7 శాతం మధ్య ఉంటుందని ఒక‌ అంచనా. 

2010 నుంచీ భారతదేశం తయారీ రంగం, మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో.. అభివృద్ధి చెందుతోంది. కానీ, 2020 తర్వాత, ప్రపంచవ్యాప్త సరఫరా గొలుసులలో చైనా  ప్ల‌స్ వ‌న‌న్ వ్యూహం వల్ల భారతదేశం పెట్టుబడిదారులను ఆకర్షించడంలో విజయం సాధించింది. 

2024 ఆగస్టు- అమెరికా, భారత్ నుంచి దిగుమతులపై 50శాతం సుంకం విధించింది. 2026 ఫిబ్రవరి 2న‌ ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మ‌ధ్య  సంభాషణ తర్వాత, అమెరికా సుంకాలను 50 శాతం నుంచి 18శాతానికి తగ్గించింది. 2026 ఫిబ్రవరి 7న ఇరు దేశాలు మధ్యంతర వాణిజ్య ఫ్రేమ్‌వర్క్ పై అంగీకరించి, సంయుక్త ప్రకటన జారీ చేశాయి. 2026 మే 29న అమెరికా రాయబారి సెర్గియో గోర్,  99శాతం పూర్తయిన ఒప్పందం, వారాల్లో సంతకం అని ప్రకటించారు. 2026 జూన్ 1-4 మ‌ధ్య కాలంలో.. అమెరికా వాణిజ్య ప్రతినిథి జామీసన్ గ్రీర్ నేతృత్వంలోని బృందం భారతదేశంలో పర్యటించి, చివరి 1శాతం వివరాలను ఖరారు చేస్తుంది.  

న్యాయపరమైన అంశాలు ఎలాంటివో ఒక ప‌రిశీలిస్తే.. మధ్యంతర ఒప్పంద‌పు నిర్మాణం..  ఈ  మధ్యంతర వాణిజ్య ఒప్పందం-  ఫ్రేమ్‌వర్క్, ఇరు దేశాల మధ్య విస్తృత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం-బీటీఏ పట్ల నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. ఈ ఒప్పందంలో ప్రధాన అంశాలు: 

అమెరికా భారత దిగుమతులపై 50శాతం నుంచి 25శాతం, దీన్నుంచి 18శానికి తగ్గించింది. భారత నిబద్ధతలు- అమెరికా ఎన‌ర్జీ, కృషి, టెక్నాలజీ ఉత్పత్తుల దిగుమతి పెంపు.. రష్యా నుంచి చ‌మురు కొనుగోలు ఆపడం, సాంకేతిక భాగస్వామ్యం- AI, సెమీకండక్టర్స్, ఫార్మా, క్వాంటం కంప్యూటింగ్, కీలక ఖనిజాలు.. విస్తృత BTA చర్చలు, మార్కెట్ యాక్సెస్, నాన్-టారీఫ్ మెజర్స్, కస్టమ్స్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్..  ఇందులో ప్ర‌ధాన పాత్ర  పోషించాయి. 

2026 ఫిబ్రవరి 7న ఇరు దేశాల‌ సంయుక్త ప్రకటన చూస్తే..  రెండు దేశాల మధ్య  ఉభయతారక వాణిజ్యం  కోసం ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇందులో 18శాతం సుంకం అమలు, రష్యా చ‌మురు కొనుగోలు ఆపడం, పెట్టుబడి ప్రమోషన్ అంశాలు ఇందులో దాగి ఉన్నాయి. 

రాజకీయ, సామాజిక, మీడియా కోణాల .. ప్రపంచ నాయకుల గుర్తింపు వ్య‌వహారానికి వ‌స్తే.. భార‌త‌దేశం మోడో అతి పెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ‌గా  అవ‌త‌రించ‌బోతోంది. న్యూజిలాండ్, యూకే, EU భారతదేశంతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నాయి, ఈ అవకాశాలను కెనడా కోల్పోవాలని నేను కోరుకోవడం లేదని అన్నారాయ‌న‌.  

ఆంథోనీ అల్బనీస్- ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి.. భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. నరేంద్ర మోడీకి స్వాగతం పలకడానికి ఆస్ట్రేలియా ఎంతో ఆసక్తి క‌రంగా ఉందన్నారు.  

ఇక ఇజ్రాయెల్ ప్ర‌ధాని- బెంజమిన్ నెతన్యాహు- భారతదేశం ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటి, సాంకేతికత, ఆవిష్కరణలలో కీలక భాగస్వామి.. గా అభివ‌ర్ణించారు.  ఇటలీ దౌత్య ప్రతినిధుల‌న్న మాట‌ల‌ను బ‌ట్టీ  చేస్తే..  భారతదేశం ప్రధాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, పెట్టుబడులకు ముఖ్యమైన భాగస్వామిగా చెప్పారు.

అమెరికా రాయబారి సెర్గియో గోర్,  గత రెండు దశాబ్దాలలో ద్వైపాక్షిక వాణిజ్యం- 20 బిలియన్ డాల‌ర్ల‌ నుంచి 220 బిలియన్ డాల‌ర్ల‌కు పెరిగింది, ఇది బలమైన ఆర్థిక ఏకీకరణను ప్రతిబింబిస్తుంద‌ని అన్నారు. ఇండో-యూఎస్ సంబంధం రెండు దేశాలకు స్పష్టమైన ప్రయోజనాలను అందిస్తుందని, ట్రంప్ ప్రభుత్వం భారతదేశాన్ని కీలక ప్రపంచ భాగస్వామిగా చూస్తుందని నొక్కిచెప్పారు. 

ద్విపాక్షిక వాణిజ్యం 20 బిలియన్ డాల‌ర్ల‌ నుంచి 220 బిలియన్ డాల‌ర్ల‌కు పెరిగింది. AI, సెమీకండక్టర్స్, ఫార్మా, క్వాంటం కంప్యూటింగ్, కీలక ఖనిజాలలో పెరుగుతున్న సహకారం వంటివి కీల‌కంగా  మారాయి. 

భారత ఎక్స్ పోర్ట్ మార్కెట్ విస్తరణ- 18శాతం సుంకం అమలు తర్వాత, భారత ఉత్పత్తులకు అమెరికా మార్కెట్‌లో మరింత ప్రాప్యత లభిస్తుంది. పెట్టుబడి ఆకర్షణ విష‌యానికి వ‌స్తే- కెనడా 2030 నాటికి భారత్‌తో వాణిజ్యాన్ని  17 బిలియన్ డాల‌ర్ల‌ నుంచి  50 బిలియన్ డాల‌ర్ల‌కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. తయారీ రంగం విస్తరణ ప‌రిస్థితి చూస్తే చైనా ప్ల‌స్ వ‌న్ వ్యూహం వల్ల భారతదేశం పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. 

భారతదేశం, చైనా వల్ల కలిగే ప్రమాదాల నుంచి బయటపడి, ప్రపంచవ్యాప్త ఆర్థిక భాగస్వాములతో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఇజ్రాయెల్‌తో  స్పెష‌ల్ స్ట్రాట‌జిక్ పార్ట‌న‌ర్ షిప్ ఏర్పాటు, AI, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్స్, క్వాంటం కంప్యూటింగ్ లో 16 ఒప్పందాలు సంతకం చేయడం, ఈ దిశలో ముఖ్యమైన అడుగు. 

ఇజ్రాయెల్, భారతదేశానికి తదుపరి 5 సంవత్సరాల్లో అదనంగా 50వేల‌ మంది కార్మికులను స్వీకరించడానికి అంగీకరించింది. UPI భారతదేశం డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ఇజ్రాయెల్‌లో విస్తరించబడుతోంది. 

జూన్ 1-4 న అమెరికా వాణిజ్య ప్రతినిధి జామీసన్ గ్రీర్ నేతృత్వంలోని బృందం భారతదేశంలో పర్యటించింది. చివరి 1శాతం వివరాలను ఖరారు చేసి, మధ్యంతర ఒప్పందాన్ని పూర్తి చేసింది. 

ఈ ఒప్పందం, భారత్- అమెరికాల మధ్య  21వ శతాబ్దపు అత్యంత కీలకమైన ద్వైపాక్షిక సంబంధాన్ని  పటిష్టం చేస్తుంది. ఇది కేవలం వాణిజ్యం మాత్రమే కాదు, భవిష్యత్ సాంకేతికతలను తీర్చిదిద్దే సామర్థ్యం కలిగిన ఒప్పందం. 

అమెరికా, భారతదేశాన్ని ఒక కీలక ప్రపంచ భాగస్వామి"గా చూస్తోంది, ట్రంప్ ప్రభుత్వం ఈ సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉంది. 

భారతదేశం ప్రస్తుతం ఆర్థికంగా, రాజకీయంగా, సాంకేతికంగా ప్రపంచంలో కీలక స్థానాన్ని సంపాదిస్తుంది. ప్రపంచ నాయకుల గుర్తింపు, ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ దేశాల నుంచి వచ్చిన ప్రకటనలు, ఈ వాస్తవాన్ని ధృవీకరిస్తున్నాయి. 99శాతం పూర్తయిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం, వారాల్లో సంతకం కాబోతోంది, ఇది భారతదేశం యొక్క ఆర్థిక విప్లవానికి కీలకమైన మైలురాయి కానుంది.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

google-ad-img
    Related Sigment News
    • Loading...